22 July, 2026 | 12:19 PM

ఓటు లేని మనిషి చచ్చిపోయినవారితో సమానం

22-07-2026 11:33 AM

బీజేపీ, బీఆర్ఎస్ వేరుకావొచ్చు.. వాళ్ల లక్ష్యం ఒక్కటే

రోజుకు 18 గంటలు పనిచేసినా.. సమయం సరిపోవట్లేదు

నాపై కుట్ర చేస్తున్నారు

కొడంగల్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్(CM Revanth Reddy Kodangal Tour) లో పర్యటిస్తున్నారు. కొడంగల్ లో స్థానిక నాయకులు, BLA లతో SIR ఓటరు జాబితా సమగ్ర సవరణపై బీఎల్ఏలను(BLAS Meeting) ఉద్దేశించి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. అంతకు ముందు ఎస్ఐఆర్ ఫామ్ నింపి సీఎం అధికారులకు అందజేశారు. ఓటు లేని మనిషి చనిపోయినవారితో సమానమని పేర్కొన్నారు. అంతా ఎస్ఐఆర్(Special Intensive Revision) నింపి ఓటు హక్కును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి పేదవాడికి మంచి చేసేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. వాళ్ల తప్పులు ప్రశ్నిస్తున్నందుకే తనపై కుట్ర చేస్తున్నారని వివరించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వేరుకావొచ్చు.. వాళ్ల లక్ష్యం మాత్రం ఒక్కటే అన్నారు. తనను దెబ్బతీసేందుకు, కాంగ్రెస్ కు ఓట్లు వేసినవాళ్ల ఓట్లు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

కొడంగల్ లో తనను దెబ్బతీస్తే.. రాష్ట్రస్థాయికి రాలేడు అని ఆలోచిస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రం కోసం రోజుకు 18 గంటలు పనిచేసినా తనకు సమయం సరిపోవట్లేదని రేవంత్ పేర్కొన్నారు. కొడంగల్ లో తనపై కుట్రలు చేసినవాళ్లను మీరే దెబ్బకొట్టాలని సీఎం పిలుపునిచ్చారు. తనను దొంగ దెబ్బ తీయాలని బీఆర్ఎస్, బీజేపీ నేతలు కుట్ర చేస్తున్నారని పేర్కొన్నారు. ఎస్ఐఆర్ వివరాలు సమర్పించేందుకు ఆగస్టు 3 వరకు గడువు ఉందని చెప్పిన సీఎం కొడంగల్ లో 78 శాతం ఓటర్లు నమోదు చేసుకున్నారని వెల్లడించారు. మిగిలిన 22 శాతం ఓట్లు నమోదు చేయించాలని సూచించారు. మిగిలిన ఓటర్లతో బీఎల్ఏలు ఎస్ఐఆర్ నమోదు చేయించాలని సీఎం ఆదేశించారు.

బీఎల్ వోలు ప్రభుత్వాధికారులు.. బీఎల్ఏలు పార్టీ కార్యకర్తలని తెలిపారు. ఓటరు జాబితాలో లేకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు రావు అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గతంతో పోలిస్తే సరైన వివరాలు లేకపోతే పక్కన పెడతారని చెప్పారు. అనుమాస్పదంగా ఉంటే సరైన ఆధారాలు చూపి ఓటర్లు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఓటు వేసి వారి జాబితా ఇప్పుడే నిర్ణయం అవుతూందన్నారు. ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీల ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు 90 శాతం కాంగ్రెస్ కు ఓట్లు వేస్తారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీల ఓట్లు తొలగిద్దామని చూస్తున్నారని పేర్కొన్నారు. పేదల ఓట్లు తొలగించి దొంగ దెబ్బ తీయాలని కుట్ర చేస్తున్నారని హెచ్చరించారు. కొడంగల్ లో అర్హులైన వారి ఓట్లు తొలగించేందుకు వీలు లేదన్నారు. బీఎల్ఏలు ఇంటింటికీ తిరిగి మిగిలిన ఓటర్లతో నమోదు చేయించాలన్నారు. ఈ నెలాఖరు నాటికి కొడంగల్ లో 100 శాతం ఎస్ఐఆర్ పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.