ఉమాదేవి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు
మంథని జులై 22 (విజయక్రాంతి): ఈ నెల 11న ఏకాదశి పుణ్యతిథి రోజున గుండెపోటుతో ఆకస్మికంగా పరమపదించిన స్వర్గీయ మహావాది ఉమాదేవి కుటుంబ సభ్యులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మంగళవారం పరామర్శించారు.
మంథనిలోని ఉమాదేవి నివాసానికి చేరుకున్న మంత్రి, ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శోకసంద్రంలో మునిగిపోయిన ఆమె భర్త మధుకర్ గుల్కోట్, కుమారుడు రవి, కుమార్తెలు రజని, స్మిత అల్లుళ్ళు సునీల్ అనిల్ లను ఓదార్చి, ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు.
అలాగే ఉమాదేవి సోదరులు సుధీర్, సతీష్, విజయ్, సోదరీలు రమాదేవి, వాణిశ్రీలను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దివంగత ఉమాదేవి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించిన మంత్రి, వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. మంత్రి రాక సందర్భంగా స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉమాదేవికి నివాళులర్పించారు. బాధిత కుటుంబానికి నేరుగా వచ్చి అండగా నిలిచిన మంత్రి శ్రీధర్ బాబును పలువురు అభినందించారు.






