22 July, 2026 | 12:19 PM

చీకటి రఘుపతిమ్మని పరామర్శించిన మంత్రి తుమ్మల

22-07-2026 11:35 AM

సత్తుపల్లి. జూలై 22 (విజయక్రాంతి):రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  రాజకీయ ప్రస్థానంలో కీలక వ్యక్తిగా ఉన్న స్వర్గీయ చీకటి సీతారామయ్య భార్య రఘుపతిమ్మ ని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు. సత్తుపల్లి లైఫ్ కేర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న రఘుపతిమ్మ ని పరామర్శించి, ఆమె ఆరోగ్య పరిస్థితిని చీకటి చిట్టి రావు  చీకటి. రంగారావు  ద్వారా అడిగి తెలుసుకున్నారు. మంత్రి తుమ్మల వెంట పట్టణ ప్రముఖులు ఉన్నారు.