18 March, 2026 | 5:02 AM

21 వరకు వర్షాలే

18-03-2026 01:50 AM

తగ్గనున్న పగటి ఉష్ణోగ్రతలు

హైదరాబాద్, మార్చి 17 (విజయక్రాంతి): రానున్న రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురువనున్నాయి. బుధవారం నుంచి ఈనెల 21 వరకు పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ మంగళవారం తెలిపింది.

ఉరు ములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో 2 నుంచి 4 డిగ్రీల మేర తగ్గుతాయని తెలిపింది.