30 June, 2026 | 10:58 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

వికసిత్ భారత్-2047లో డిజిటల్ పరివర్తన కీలకం

13-03-2026 12:00 AM
  1. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిస్టారెడ్డి
  2. ఓయూలో డిజిటల్ ఉన్నత విద్య జాతీయ సెమినార్ ప్రారంభం
  3. పాల్గొన్న ఓయూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం

సికింద్రాబాద్, మార్చి 12 (విజయక్రాంతి): నాణ్యమైన విద్యను అందరికీ అందుబాటు లోకి తీసుకురావడంలో డిజిటల్ ఎడ్యుకేషనల్ మీడియా కీలక పాత్ర పోషిస్తుందని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిస్టా రెడ్డి అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఎడ్యుకేషనల్ మల్టీమీడియా రీసెర్చ్ సెంటర్ వేదికగా ఉన్నత విద్య పునర్నిర్మాణం వికసిత్ భారత్ 2047 దిశగా డిజిటల్ మార్గాలు అనే అంశంపై రెండు రోజుల జాతీయ సెమినార్ గురువారం ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలు సాంకేతికతను వేగంగా స్వీకరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. గ్లోబల్ నాలెడ్జ్ ఎకానమీ అవసరాలకు అనుగుణంగా డిజిటల్ బోధ నా విధానాలను అమలు చేయ డం కీలకమని తెలిపారు. అనంతరం రెండు రోజుల పాటు జరిగే ఈ సెమినార్లో కృత్రిమ మేధ స్సు, మూక్స్, మీడియా ఆధారిత బోధన వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి.

ఈ కార్యక్రమంలో కన్సార్టియం ఫర్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ పరిక్షిత్ సింగ్ మన్హాస్, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం, ఎడ్యుకేషనల్ మల్టీమీడియా రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ పి. రఘుపతి తదితరులు పాల్గొన్నారు.