25 April, 2026 | 3:21 AM

దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ఎదగాలి

25-04-2026 12:00 AM

పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి 

ఎల్బీనగర్/నాగోల్, ఏప్రిల్ 24 : దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో స్వతంత్రంగా జీవితంలో ఎదగాలని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రామ్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం, వికలాంగుల కార్పొరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం కొత్తపేటలోని రాధా మానసిక వికలాంగుల సంస్థలో దివ్యాంగులకు వాహనాలు పంపిణీ చేశారు. 

ఎల్బీనగర్ నియోజ కవర్గంలోని పలువురు లబ్ధిదారులకు వాహనాలను అందజేసి, హెల్మెట్లను అందజేశా రు.  శిశు సంక్షేమ శాఖ సిబ్బందికి ఫోన్లు అందజేశారు. ఈ సందర్భంగా మధుయాష్కీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమంలో భాగంగా దివ్యాంగులకు వాహనాలను అందజేసిందన్నారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ... దివ్యాంగుల సం క్షేమానికి ప్రభుత్వం మరిన్ని పలు కార్యక్రమాలు అమలు చేయాలన్నారు.

కార్యక్రమం లో సీడీపీవో రేణుక, డీడీఆర్సీ రమేశ్,  సూపర్ ఇండెంట్ ఇమ్రానుద్దీన్, అధికారులు వనజ, గీత, చంద్ర పావని, యాదగిరి, శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు వజీర్ ప్రకాష్ గౌడ్, రాగుల వెంకటేశ్వర రెడ్డి, కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు లింగాల కిశోర్ గౌడ్, సురేందర్ రెడ్డి, శ్రీపాల్ రెడ్డి, వేణుగోపాల్ యాదవ్, చెన్న గోని రవీందర్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పాశం అశోక్ గౌడ్, నేలపాటి రామారావు, పన్యాల జయపాల్ రెడ్డి , మెగావత్ గణేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.