25 April, 2026 | 1:48 AM

బరితెగిస్తున్న బిల్డర్లు చెలరేగిపోతున్న చైన్‌మెన్లు!

25-04-2026 12:00 AM
  1. మొద్దు నిద్రలో నిజాంపేట సర్కిల్ పట్టణ ప్రణాళిక అధికారులు
  2. సర్కిల్ పరిధిలో అడ్డు అదుపు లేకుండా అక్రమ నిర్మాణాలు
  3. కంటితుడుపు చర్యలతో కాలం గడుపుతున్న అధికారులు
  4. అధికారుల తీరుపై తలెత్తుతున్న పలు అనుమానాలు
  5. ఉన్నత అధికారుల పర్యవేక్షణ లోపమే అక్రమాలకు ఆజ్యం
  6. అధికారుల కాసుల కక్కుర్తితో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి

కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 24(విజయక్రాంతి): పిల్లి గుడ్డిది అయితే ఎలుక తోకెత్తి చూపించినట్టు... అమ్యామ్యాల రుచితో అధికారులను అంధకారులుగా మార్చి ఇష్టారీ తిన రెచ్చిపోతున్నారు నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని అక్రమ నిర్మాణదారులు. ఓ వైపు పట్టణ ప్రణాళిక అధికారులు చర్యలు అం టూ ఎంపిక చేసిన అక్రమ నిర్మాణాలపైనే చర్యలు తీసుకుంటున్నారని అక్రమ నిర్మాణాల పట్ల పక్షపాత ధోరణితో అధికారులు వ్యవహరిస్తున్నట్టు సర్కిల్ పరిధిలో ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

ఇటీవలే అక్రమ నిర్మాణాలపై నిజాంపేట్ సర్కిల్ పట్టణ ప్రణాళిక అధికారులు చర్యలు తీసుకున్న కూడా కొందరి నిర్మాణదారులలో మాత్రం ఎలాంటి మార్పు రాకపోవడం స్థానికులను విస్మయానికి గురి చేస్తోంది. అధికారులు మారిన అక్రమ నిర్మాణధారులలో ఎలాంటి మార్పు రాదు అనే భావన స్థానికులలో రోజురోజుకి బలపడుతుంది.

అధికారు లు ఎవరైనా... ఎలాంటి చర్యలు తీసుకున్న చేతులు తడిపే వరకే అని, ఒక్కసారి చేతులు తడిస్తే ఇక అటువైపు కన్నెత్తి కూడా చూడరని సర్కిల్ పరిధిలోని పలు అక్రమ నిర్మాణాలు చూస్తుంటే అధికారుల తీరు స్పష్టమవుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

బిల్డర్ బరితెగింపు...అధికారుల మొద్దు నిద్ర?

ప్రగతి నగర్ కాకతీయ హిల్స్ లో ప్లాట్ నం.20 సర్వే నం .180/బి లో సుమారు 265 గజాల ప్లాటులో ఓ నిర్మాణధారుడు హెచ్‌ఎండీఎ నుండి మే 2025 స్టిల్ట్+4 అనుమతులు పొంది నిర్మాణ పనులు ప్రారంభించాడు. ఇం తవరకు నియమాలకు లోబడి సదరు నిర్మాణధారుడు నిర్మాణం పూర్తి చేసి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్(ఓసీ) మం జూరు కావడంతోనే తన అతి తెలివి ప్రదర్శించి అదనంగా నియమాలకు విరుద్ధంగా మరో అంతస్తు నిర్మాణం చేపట్టాడు.

ఈ ఉదంతం అంత  పట్టణ ప్రణాళిక అధికారుల కనుసన్నల్లోనే కొనసాగుతుంది అని, అధికారులకు సదరు నిర్మాణదారుడికి చీకటి ఒప్పందం కుదరడంతో అటువైపు కన్నెత్తి చూడడం లేదు అనే ఆరోపణలు స్థానికుల నుండి వెలువెత్తుతున్న అధికారులు మాత్రం మొద్దు నిద్ర వీడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పైగా సదరు నిర్మాణధా రుడు సైతం అధికారులు ఏమి చేయలేరు అనే ధీమా వ్యక్తం చేస్తూ మేకపోతు గాంభీ ర్యం ప్రదర్శిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.

ఇలా చెప్పుకుంటూ పోతే సర్కిల్ పరిధిలోని అక్రమాలు మరెన్నో అయిన అధికారు లు తీరు మారదు అంటూ స్థానికులు పెదవి విరుస్తున్నారు.  ఇప్పటికైనా ఉన్నత అధికారులు కలుగచేసుకొని అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసి తగు చర్యలు తీసుకొని ప్రభు త్వ ఆదాయానికి గండి పడకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

స్పందించని సర్కిల్ ఏసీపీ ప్రసీద..

అయితే ఇదే విషయంపై నిజాంపేట్ సర్కిల్ ఏసీపీ ప్రసీద ను వివరణ కోసం పలుమార్లు సంప్రదించిన కార్యాలయంలో అందుబాటులో లేకపోవడం ఫోన్ కి కూడా స్పందించలేదు. ఇప్పటికైనా ఏసీపీ కలుగచేసుకొని చర్యలు తీసుకుంటుందా అనేది చూడాలి.