11-02-2026 03:03:35 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ నిబంధనలను తుంగలో తొక్కుతూ.. రాంగ్ రూట్లో దూసుకెళ్లే వాహనదారులపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. రోడ్డు భద్రతే లక్ష్యంగా చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో కేవలం వారం రోజుల్లోనే 21,713 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ డి. జోయల్ డేవిస్ ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలో రాంగ్ సైడ్ డ్రైవింగ్ అనేది ప్రమాదకరమైన అలవాటుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది కేవలం ట్రాఫి క్ రద్దీకి కారణమవ్వడమే కాకుండా, నిబంధనలు పాటించే ఇతర వాహనదారుల ప్రాణాలకు ముప్పు తెస్తోందన్నారు. ప్రమాదాలకు ప్రధాన కారణాల్లో రాంగ్ రూట్ డ్రైవింగ్ ఒకటని పేర్కొన్నారు.
7 రోజుల్లో 21,713 మందిపై చర్యలు
రోడ్డు క్రమశిక్షణను మెరుగుపరిచే దిశగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌ను చేప ట్టారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి మొదటి వారం వరకు నగరవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ ఒక్క వారంలోనే రాంగ్ రూట్ డ్రైవింగ్ నడిపిన 21,713 మందిపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించినట్లు పోలీసులు తెలిపారు.
బాధ్యతగా వ్యవహరించండి
వాహనదారులు తమ ప్రాణాలతో పాటు తోటి ప్రయాణికుల ప్రాణాలను కూడా దృష్టిలో ఉంచుకొ ని బాధ్యతాయుత డ్రైవింగ్ అలవాటు చేసుకోవాల ని జాయింట్ సీపీ విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియా ద్వారా నిరంతరం అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఎక్కడైనా ట్రాఫిక్ ఉల్లంఘనలు కనిపిస్తే పౌ రులు వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు.