25 April, 2026 | 4:03 AM

ప్రేమకి పులిహోర కలిపామా..

25-04-2026 12:39 AM

తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన తాజాచిత్రం ‘గాయపడ్డ సింహం’. రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ చిత్రానికి సూర్యప్రకాశ్ జ్యోసుల కథను అందించారు. పవన్ సదినేని సమర్పణలో కళ్యాణచక్రవర్తి మంథిన, భానుకిరణ్ ప్రతా ప, విజయ్‌కృష్ణ లింగమనేని, ఉమేశ్ బన్సాల్ నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించిన ఈ సినిమాలో జేడీ చక్రవర్తి కీలక పాత్ర పోషిం చారు.

విష్ణు ఓయి, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. మే 1న థియేటర్లలో విడుదల కానుం దీ చిత్రం.  మేకర్స్ తాజాగా ఫోర్త్ సింగిల్ ‘ప్రేమకి పులిహోర’ను రిలీజ్ చేశారు.  ‘ప్రేమకి పులిహోర కలిపామా ఇలాగ రాచేసి.. పెళ్లికి రూటే వేశామా మరోటి జత చేసి.. కళ్లూ కళ్లూ కావని తెలుసు.. ఇంకోటేదో ఉందని తెలుసు.. ఐనా దాన్ని కదిపావే ఇల్లా.. మూడేదాక మనకింతే మళ్లా..’ అంటూ సాగుతోందీ గీతం.

చిత్ర సంగీత దర్శకుడు స్వీకర్ అగస్తి రాసి, స్వరపర్చిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ఈ చిత్రానికి విద్యాసాగర్ చింతా సినిమాటోగ్రఫీని, విప్లవ్ నైషదం ఎడిటింగ్‌ను, చంద్రిక గొర్రెపాటి ప్రొడక్షన్ డిజై న్‌ను నిర్వహిస్తున్నారు.