22 April, 2026 | 2:51 PM

Breaking News

కాళేశ్వరంపై కేంద్రం సీబీఐ విచారణ చేయించాలి.. కాంగ్రెస్ ఎంపీ చామల రెడ్డి   •   ఆర్టీసీ సమ్మెకు బిజెపి మద్దతు..   •   గ్రామంలో గుప్త నిధుల కలకలం   •   షాద్‌నగర్ చౌరస్తాలో మల్లికార్జున ఖర్గే దిష్టిబొమ్మ దగ్ధం   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •  

రేపు డయల్ యువర్ సీఎండీ

21-11-2025 07:41 PM

మంచిర్యాల,(విజయక్రాంతి): సింగరేణి సంస్థలో ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుదల, రక్షణ,  వైద్య సేవల మెరుగుదల వంటి  అంశాలపై సింగరేణి సిఎండీతో ఈ నెల 22న డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం ఉంటుందని శ్రీరాంపూర్ జిఎం మునిగంటి శ్రీనివాస్ తెలిపారు. సింగరేణి సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరామ్ నాయక్ శనివారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు “డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం”లో పాల్గొని సింగరేణి వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాల కార్మికులు, అధికారుల సమస్యలను తెలుసుకుంటారన్నారు. సింగరేణి సంస్థ ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుదల, రక్షణ, వైద్య సేవల పెంపుదలకు నిర్మాణాత్మక సూచనలు, సలహాలు ఫోన్ ద్వారా పంచుకోవచ్చని, ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు 040-23311338 నెంబర్ కు  కాల్ చేయాలని సూచించారు.