6 June, 2026 | 2:24 PM

మహిళల భద్రత కోసం 'స్త్రీ రైడ్'.. ప్రారంభించిన డీజీపీ ఆనంద్

06-06-2026 01:06 PM

హైదరాబాద్: స్త్రీ రైడ్( Stree Rides) కార్యక్రమాన్ని డీజీపీ సీవీ ఆనంద్(DGP CV Anand) ప్రారంభించారు. మహిళల భద్రత, సాధికారత లక్ష్యంగా విమెన్ సేఫ్టీ వింగ్ ప్రత్యేక ప్రాజెక్టు ఇది. తొలి విడతలో 55 మంది మహిళలకు స్త్రీ రైడర్లుగా అవకాశం కల్పించారు. అంబర్ పేట్ పోలీస్ లైన్ లో ప్రత్యేక డ్రైవింగ్ శిక్షణ పూర్తి చేసిన 55 మంది మహిళలకు డ్రైవింగ్ లైసెన్సులు అందజేశారు. టూ వీలర్, త్రీ వీలర్ డైవింగ్ నైపుణ్యాల్లో మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. స్త్రీ రైడర్లు అత్యవసర పరిస్థితుల్లో మహిళలకు సురక్షిత రవాణా సేవలు అందించనున్నారు. మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.