22 April, 2026 | 2:08 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

భక్తికథా చిత్రం ప్రారంభం

08-04-2026 01:39 AM

తమిళ సినీ ఇండస్ట్రీలో విజయవంతమైన ప్రముఖ కంటెంట్ స్టూడియో అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో భాగంగా టెంపుల్ టౌన్ పిక్చర్స్‌తో కలిసి చేయబోతున్న కొత్త సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారం భించారు. ‘కనక దుర్గ’ అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ అల్లరి నరేశ్ కథానాయకుడిగా నటిస్తుండగా, కాజల్ చౌదరి హీరోయిన్‌గా చేస్తోంది.

సుబ్బరాజు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ భక్తి ప్రధాన కథా చిత్రానికి బీవీఎస్ రవి కథ అందిస్తుండగా, ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తున్నారు. సమీర్ నాయర్, దీపక్ సెహగల్, అజిత్ ఠాకూర్, బీవీఎస్ రవి నిర్మాతలు. భారతీయ దేవతల ఆధారంగా రూపొందనున్న ఈ సినిమా.. భక్తి, యాక్షన్, భావోద్వేగాలు, సంగీతం వంటి అన్ని అంశాల సమ్మిళతంగా ప్రేక్షకులకు మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని టీమ్ వెల్లడించింది.

ముహూర్తపు సన్నివేశానికి ముఖ్యఅతిథులుగా హాజరైన నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, సురేఖ కొణిదెల కెమెరా స్విచ్ ఆన్ చేశారు. స్వప్న దత్ గౌరవ దర్శకత్వం వహించారు. శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి స్క్రిప్టును అందించారు. ఇంకా ఈ సినిమా ప్రారంభ కార్యక్రమంలో హరీశ్ శంకర్, మిక్కిలినేని సుధాకర్, కోన వెంకట్, ప్రశాంత్‌వర్మ, మధుర శ్రీధర్, సుప్రియ, విద్యా కొప్పినీడు, పద్మ కస్తూరి రంగన్, అనురాధ గూడూరు, దివ్య విజయ్, హన్షిత రెడ్డి, జాన్వీ నారంగ్, స్రవంతి చొక్కారపు, వైఘా రెడ్డి, విరుప తదితరులు అతిథులుగా విచ్చేశారు.