20 June, 2026 | 7:12 PM

Breaking News

ఫీజులు నియంత్రించకపోతే ఆందోళ తప్పదు   •   నామ భద్రయ్య మృతి పట్ల మాజీ ఎంపీ నామ, ఎంఎల్సీ తాతా మధుసూదన్ సంతాపం   •   మధిర కోర్టు ఆవరణలో జాతీయ మెగా లోక్ అదాలత్   •   సింగరేణి ఖాళీ క్వార్టర్ల సద్వినియోగానికి చర్యలు తీసుకోవాలి: ఏఐటీయూసీ   •   కొమరారం మండల ఏర్పాటుకు మంత్రి దామోదర రాజనరసింహకు వినతి   •   యువత హక్కుల కోసం కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుంది   •   రైతులను నమ్మించి నట్టేట ముంచుతారా   •   కేరళ గ్లోబల్ హై స్కూల్‌లో ఘనంగా ముందస్తు యోగా దినోత్సవం   •   అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి   •   సీఆర్టీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్   •  

శ్రీ కురుమూర్తి కొండకు పోటెత్తిన భక్తజనం

19-01-2026 12:13 AM

చిన్న చింతకుంట, జనవరి 18: తిరుమల తిరుపతి వెంకన్నగా భక్తుల మొక్కులు అందుకుంటున్న శ్రీ కురుమతి స్వామి కొండకు భక్తులు పోటెత్తారు. ఆదివారం మౌని అమావాస్య సందర్భంగా జిల్లా నలుమూలల నుంచే కాకుండా పల్లె ప్రాంతాల నుంచి భక్తులు ఉదయాన్నే ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కాలినడకన స్వామివారి కొండకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కొండ దిగువ నుంచి స్వామివారి సన్నిధి వరకు ఉన్న క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. భక్తులను అదుపు చేసేందుకు పోలీసులు, ఆలయ ఈవో, దేవస్థాన సిబ్బంది ఎంతో ఇబ్బంది పడ్డారు. భక్తుల గోవింద నామస్మరణతో కాంచన గుహ పులకరించింది. స్వామివారికి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత అన్నదానాన్ని ఏర్పాటు చేశారు.పేదల తిరుపతిలో ధరలు భారం కురుమూర్తి లడ్డు ప్రసాదం  భావోద్వేగాలను రేకేత్తించేలా భక్తుల ఆవేదన  కురుమూర్తి స్వామి దేవాలయంలో నియమాల ప్రకారం 100 గ్రాములు ఉన్న లడ్డు ప్రసాదము రూ.15 రూపాయలకు ఇవ్వాల్సి ఉన్న నియమాలు పాటించకుండా ఎక్కువ ధరలకు అనగా రూ.50 కి 3 లడ్లు రూ.100 కి 6లడ్డు, పులిహోర ప్రసాదములు అమ్ముతున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. కురుమూర్తి స్వామి ఏవోను ఫోన్ సంప్రదించినప్పటికి అందుబాటులోకి రాలేదు.