3 August, 2026 | 3:22 AM

‘ఎల్లమ్మ’ నుంచి పర్శి వచ్చిండు!

03-08-2026 01:57 AM

విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ విజయాన్ని అందుకున్న ‘బలగం’ చిత్రం తర్వాత దర్శకుడు వేణు యెల్దండి అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘ఎల్లమ్మ’. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో, శిరీష్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం, బలమైన భావోద్వేగాలను, సాంస్కృతిక నేపథ్యాన్ని మిళితం చేస్తూ సాగుతుంది. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ (డీఎస్పీ) ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహిస్తుండటంతోపాటు హీరోగా పరిచయమౌతున్నారు.

తాజాగా ఈ చిత్రబృందం ‘పర్శి’గా దేవిశ్రీప్రసాద్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. డీఎస్‌పీ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ ఫస్ట్‌లుక్ ప్రత్యేకత సింప్లీసిటీ. ఈ మధ్యకాలంలో భారీ మాస్ పోస్టర్లు, ఓవర్ ది టాప్ ప్రెజెంటేషన్లు ఎక్కువగా కనిపిస్తున్న సమయంలో ఈ మూవీ టీమ్ మాత్రం పూర్తిగా భిన్నంగా ప్రజెంట్ చేసింది. సింపుల్ డ్రెస్‌లో, చేతిలో కిరీటాన్ని పట్టుకుని ఎంతో సహజంగా నిలబడ్డ డీఎస్పీ లుక్‌లో అమాయకత్వం, నిజాయితీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.  

‘కింగ్ 100’ సినిమాకు దేవిశ్రీ మ్యూజిక్.. 

నాగార్జున అక్కినేని మైల్‌స్టోన్ 100వ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో టబు కీలక పాత్రలో నటిస్తున్నట్టు టీమ్ ప్రకటించింది. ‘నిన్నే పెళ్లాడతా’, ‘ఆవిడ మా ఆవిడే’ చిత్రాల తర్వాత మరోమారు నాగార్జున కాంబినేషన్ వస్తున్న ఈ చిత్రానికి సంబంధించి మరో క్రేజీ అప్డేట్‌ను అన్నపూర్ణ స్టూడియోస్ ప్రకటించింది. దేవిశ్రీప్రసాద్ ఈ ప్రాజెక్టుకు సంగీత దర్శకుడిగా అధికారికంగా చేరారు. నాగార్జున సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. నాగార్జున ‘మన్మథుడు’, ‘మాస్’, ‘కింగ్’, ‘కుబేర’ చిత్రాలకు డీఎస్పీ అందించిన సంగీతం చార్త్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ మైలురాయి చిత్రానికి కూడా అదే స్థాయి మ్యాజిక్‌ను రిపీట్ చేస్తారనే అంచనాలు నెలకొన్నాయి.