28 April, 2026 | 4:33 PM

Breaking News

సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ   •   గుగ్గిళ్ళ రమేష్ పై తగిన చర్యలు తీసుకోవాలి: ఉద్యోగుల జేఏసీ   •   పరీక్షల్లో అనుత్తీర్ణులు అయిన విద్యార్థులు నిరాశ చెందకూడదు   •   కొల్చారం జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు-లారీ ఢీ: 15 మందికి గాయాలు   •   సీఎం రేవంత్, మంత్రి పొన్నం చిత్రపటాలకు యూత్ కాంగ్రెస్ పాలాభిషేకం   •   ఏకాగ్రత, మేధస్సు పెంపొందించేందుకు చెస్ చాలా ఉపయోగకరం   •   కిషన్ బాగ్‌లో భారీ అగ్నిప్రమాదం.. సోఫా వర్క్‌షాప్‌లో మంటలు   •   తెలంగాణ టెన్త్ ఫలితాలకు డేట్ ఫిక్స్.. రేపు మధ్యాహ్నం రిజల్ట్స్   •   పెద్దపల్లిలో మే 6న మెగా జాబ్ డ్రైవ్ నిర్వహణ   •   నూతన తాసిల్దార్ ను శాలువాతో సన్మానించిన మాజీ జెడ్పిటిసి   •  

సూపర్ ఏఐ సర్టిఫికేట్ సాధించిన దేవరకొండ వాసి పొట్ట శిల్ప ప్రభు

28-04-2026 02:55 PM

దేవరకొండ,(విజయక్రాంతి): ఈనెల 26వ తేదీన హైదరాబాద్లోని సోమాజిగూడ కత్రియ హోటల్లో జరిగిన కార్యక్రమంలో శ్రీమతి పొట్ట శిల్ప కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో ఘన విజయాన్ని సాధించారు. ఆమె ఇటీవల ఏఐ కోర్సును విజయవంతంగా పూర్తి చేసి సూపర్ ఏఐ సంస్థ నడి ధృవీకరణ పత్రాన్ని (సర్టిఫికేట్) అందుకున్నారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రస్తుతం ప్రపంచంలో ఏఐకి ఉన్న ప్రాముఖ్యతను గుర్తించి ఈ కోర్సును పూర్తి చేశానని, భవిష్యత్తులో ఈ రంగంలో మరింత ముందుకు వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. మహిళలు కూడా సాంకేతిక్ల రాణించాలనే ఉద్దేశ్యంతో ఈ అడుగు వేసినట్లు చెప్పారు.శ్రీమతి శిల్ప సాధించిన ఈ ఘనతపై గ్రామస్థులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఆమె మామ  పొట్ట సుగుణయ్య (మాజీ కౌన్సిలర్), భర్త పొట్ట ప్రభు (యూత్ కాంగ్రెస్ పట్టణ ఉపాధ్యక్షులు) స్నేహితులు ఆమెను అభినందించారు