28 April, 2026 | 5:20 PM

Breaking News

జొన్నల కొనుగోలు సెంటర్లను పెంచండి   •   తుమ్మల నివాసంలో పూర్వ మిత్రుల కలయిక   •   అశ్వాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ మంజూరుపై ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు   •   దేవరకొండలో కళాశాల గోడపత్రిక ఆవిష్కరణ   •   దేవరకొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్.. నలుగురు కో-ఆప్షన్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక   •   బేగంపేట్‌లో మాజీ మంత్రి జీవన్ రెడ్డికి ఘన సన్మానం   •   నిలిచిపోయిన నీటి దారులు   •   బెంగాల్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్   •   సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ   •   గుగ్గిళ్ళ రమేష్ పై తగిన చర్యలు తీసుకోవాలి: ఉద్యోగుల జేఏసీ   •  

దుబ్బ తండాలో చలివేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ మత్రు నాయక్

28-04-2026 03:00 PM

కారేపల్లి,(విజయక్రాంతి): దుబ్బ తండ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మంగళవారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. దుబ్బ తండ బస్ స్టాండ్ సెంటర్ లో చలివేంద్రాన్ని సర్పంచ్ ఆంగోతు మత్రు నాయక్ కార్యదర్శి రఘులు ప్రారంభించారు. వేసవి ఎండల దృష్ట్యా, ప్రయాణికులు, బాటసారుల దాహార్తిని తీర్చడానికి పంచాయతీ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్ వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని సర్పంచ్ మత్రు నాయక్ తెలిపారు.

వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ సహకారంతో గ్రామపంచాయతీ అభివృద్దికి ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. పంచాయతీ అభివృద్ధికి గ్రామస్తుల సహకారం ఎంతో ఉందన్నారు. ఈకార్యక్రమంలో భూక్య లచ్చిరాం.బానోతు శ్రీరాం.మలోతు డకు . లక్ష్యం.నంద.గనేష్ . బాబురావు.రవి.రమేష్. గ్రామపంచాయతీ సిబ్బంది మహేష్ . రవి. హిట్లర్. రమేష్. బిల్ తీ. తదితరులు పాల్గొన్నారు.