19 May, 2026 | 2:10 AM

అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

19-05-2026 12:00 AM

ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్

ఉప్పల్, మే18 (విజయక్రాంతి):  ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త సైనికుల్లా పనిచేసే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని  రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ పార్టీ శ్రేణులకు లిపుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి నుంచి  బలోపేతం చేసి దిశగా ఉప్పల్లోని సోమవారం మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు తోటకూర వజ్రేష్‌యాదవ్, ఉప్పల్ ఇంచార్జ్ మం దుముల పరమేశ్వర్‌రెడ్డి నిర్వహించిన కాంగ్రెస్ సమీక్ష సమావేశాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అన్ని నెరవేర్చిందని, రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ అన్ని డివిజన్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుంద ని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు