17 April, 2026 | 8:27 PM

Breaking News

ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రంలో అరైవ్-అలైవ్ సేఫ్టీపై అవగాహన   •   మా పట్టా భూమిలో ఎటువంటి నిర్మాణం చేపట్టొద్దు: పుట్ట వెంకటమ్మ   •   ప్రభుత్వమే మమ్ములను సమ్మెలోకి నెట్టుతుంది   •   స్థలం కేటాయిస్తే బస్టాండ్ నిర్మాణం కోసం కృషి చేస్తాం   •   మున్సిపల్ కార్యాలయం వద్ద చలివేంద్రం ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ రాజు   •   పీజీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు నాల్గవ సెమిస్టర్ పరీక్ష రుసుము నిర్ధారణ   •   ఉద్యమ రిజిస్ట్రేషన్ గురించి వివోఏలకు అవగాహన   •   శాతవాహనలో నల్ల బ్యాడ్జీలతో నిరసన   •   మల్లాపూర్‌లో బీజేపీ ఎంపీ దిష్టిబొమ్మ దహనం   •   ఎర్రకుంట స్మశాన వాటికలో చెట్ల తొలగింపు   •  

ప్రజా పాలనతో అభివృద్ధి

17-04-2026 07:17 PM

సమస్యల పరిష్కారం

మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ

సుల్తానాబాద్,(విజయక్రాంతి): ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో అభివృద్ధి పనులు చేసుకోవడం తో పాటు సమస్యలను పరిష్కరించుకోవడం జరుగుతుందని సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ అన్నారు, శుక్రవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పూసాల 13వ వార్డు కౌన్సిలర్ సిద్ధ తిరుపతితో కలిసి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలో రోడ్లను శుభ్రం చేశారు, పరిసరాలను ప్రతి ఒక్కరూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని కాలనీ వాసులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో మునిసిపల్ వైస్ చైర్మన్ అంతటి పుష్పలత, కమిషనర్ రమేష్, కౌన్సిలర్లు, కాలనీవాసులు పాల్గొన్నారు. అలాగే సుల్తానాబాద్ ఊర పెద్ద చెరువు ను మినీ ట్యాంక్ బండ్ గా అభివృద్ధి చేసేందుకు గాను చైర్మన్ బిరుదు రాధాకృష్ణ ఆధ్వర్యంలో కౌన్సిలర్లు, కమిషనర్ రమేష్, రెవెన్యూ అధికారులు, ఆర్ అండ్ బి, ఇరిగేషన్ అధికారులతో కలిసి చెరువు కట్టను సందర్శించడం జరిగింది.