27 March, 2026 | 5:02 AM

ఆరు గ్యారెటీలకు చట్టబద్ధత కల్పించాలి

27-03-2026 01:17 AM

మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య

తుంగతుర్తి, మార్చి 26: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అభయహస్తం పేరుతో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో చట్ట బద్దత కల్పించాలని బిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తాడికొండ సీతయ్య అన్నారు.

అన్నారం గ్రామంలో బి ఆర్‌ఎస్ గ్రామశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ఎన్నికలముందు మహిళలకు 2500. వికలాంగులకు 6000. వృద్ధులకు. 4000.రైతులకు 15000వేలు. నిరుద్యోగభృతి . విద్యార్థులకు విద్యాభరోస కార్డు. నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసపూరిత మాటలు చెప్పి అధికారానికి వచ్చిరెండున్నరెండ్లు అవుతున్న ఒక్కటి నెరవేర్చ లేదని అన్నారు.

అధికారంలోకి రాగానే చట్ట బద్దత కల్పిస్తామని చెప్పిన మాటలు మరిచిపోయిన ప్రభుత్వానికి ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీ లో ప్రవేశ పెట్టబోయే ప్రైవేట్ మంబర్ బిల్లు కు ప్రభుత్వం మద్దతివ్వాలని అన్నారు.. ఏప్రిల్ నెలాఖరు వరకు కాల్వల్లో నీళ్లు ఇవ్వాలని నోటికాడికి వచ్చిన వరిపంట ఎండిపోకుండా రైతాంగాన్ని కాపాడాలని. రైతు భరోసా వాయిదా పద్ధతుల్లో కాకుండా ఎకరానికి ఆరువేల చొప్పున యాసంగి పంట డబ్బులను ఒకేసారి ఇవ్వాలని అన్నారు.

యాసంగి పంటకు  ఇవ్వాల్సింది ఇవ్వకుండా కొత్తలప్పుడు వాయిదాల ప్రాకార మివ్వడమంటే ఈ పేరుతో వచ్చే వానకాలం భరోసా ఎగ్గొట్టేందుకు ప్రభు త్వం ఎత్తుగడ చేస్తుందని అన్నారు.  ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్ మండల నాయకులు దొంగరి శ్రీనివాస్. సర్పంచ్ కుంచాల శ్రీనివాసరెడ్డి. నాయకులు. మట్టిపెల్లి వెంకట్. మన్నూరు పోతరా జు. ఇసాకర్. సతీష్. బెడద రాములు. మాజీ సర్పంచ్ సోమశేఖర్. సైదులు. సరిత. బింగివెంకన్న మహేష్ తదితరులు పాల్గొన్నారు.