7 March, 2026 | 1:10 PM

అభివృద్ధే లక్ష్యం..

07-03-2026 01:47 AM

కమిషనర్ శ్రావణ్..

రామయంపేట, మార్చి 6(విజయక్రాంతి): పట్టణ అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, డ్రైనేజీలు మాత్రమే కాదు& ప్రజల ఆశలు, అవసరాలు నెరవేర్చే బాధ్యత కూడా. ఆ బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించేందుకు సిద్ధమయ్యానని రామాయంపేట నూతన మున్సిపల్ కమిషనర్ బీర్ శ్రావణ్ స్పష్టం చేశారు. ప్రజల సహకారంతో రామాయంపేటను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

రామాయంపేట మున్సిపల్ కమిషనర్గా బుధవారం పూర్తి బాధ్యతలు స్వీకరించిన బీర్ శ్రావణ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి విషయంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని అన్నారు. రామాయంపేట అభివృద్ధికి ప్రతి ఒక్కరు చేయూతనివ్వాలని, ప్రజల అవసరాలు ఏవైనా ఉంటే మున్సిపల్ పరిపాలన ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు. నూతనంగా ఏర్పాటైన మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు కూడా పట్టణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని ఆయన సూచించారు. రామాయంపేటను శుభ్రంగా, సుస్థిరంగా, అభివృద్ధి దిశగా నిలబెట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని కమిషనర్ బీర్ శ్రావణ్ స్పష్టం చేశారు.