7 March, 2026 | 9:28 AM

ప్రజల సొమ్ముతో ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ ప్రకటనలు ఖజానాకు చిల్లు!

07-03-2026 01:46 AM

ప్రజల సొమ్ముతో ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ ప్రకటనలు

గతంలో బీహార్.. ఇప్పుడు కేరళలో..

సంక్షేమానికి నిధులు నిల్.. ప్రచారానికి ఫుల్!

హైదరాబాద్, మార్చి 6 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వ ప్రకటన లు ఇతర రాష్ట్రాల్లో వెలువడటం మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది. తాజాగా కేరళలోని వార్తా పత్రికల్లో తెలంగాణ ప్రభుత్వం తమ పథకాలపై ప్రకటనలు ఇవ్వడం వివాదంగా మారింది. గతంలో బీహార్‌లో కూడా ఇదే తరహాలో ప్రకటనలు వెలువడిన విషయం గుర్తు చేస్తూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

అయితే ఇతర రాష్ట్రాల్లో ప్రకటనలు ఇవ్వడం కొత్త విషయం కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సాధారణంగా రాష్ట్రాల సంస్కృతి, పర్యాటకం, ఆధ్యాత్మిక కార్యక్రమాల ప్రచారం కోసం దేశ వ్యాప్తంగా ప్రకటనలు ఇవ్వడం సాధారణంగా జరుగుతుంది. ముఖ్యంగా పెద్ద ఉత్సవాలు, పర్యాటక ప్రోత్సాహం లేదా ఆధ్యాత్మిక కేంద్రాల ప్రచారం కోసం ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రకటనలు ఇవ్వడం గతంలోనూ జరిగింది. కానీ కేవలం ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో మాత్రమే తెలంగాణ ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడం తాజా గా రాజకీయంగా దుమారం రేపుతున్నది.

దీంతో తెలంగాణ ప్రభుత్వ విధా నాలపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులకు నిధుల కొరత ఉందని అధికార యం త్రాంగం చెబుతుండగా, అదే సమయంలో ఇతర రాష్ట్రాల్లో భారీ ప్రకటన లపై ప్రజాధనం ఖర్చుచేస్తున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రాష్ట్ర ప్రజల పన్నుల ద్వారా వచ్చే నిధులను..

ఖజానాకు చిల్లు పెడుతూ ఇతర రాష్ట్రాల్లో ప్రకటనల కోసం వినియోగించడం అనవసర వ్యయం కాదా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు సంక్షేమ పథకాల అమలు, విద్యార్థులకు అందాల్సిన సౌకర్యాలు, రైతు సంక్షేమ కార్యక్రమాలకు నిధులు సరిపోవడం లేదనే ఆరోపణలు వస్తుండగా.. మరోవైపు ప్రచారం కోసం కోట్ల రూపాయలు వె చ్చించడం ప్రభుత్వ ప్రాధాన్యతలపై సందేహాలు రేకెత్తిస్తోంది. మింగ మెతుకు లేదు.. మీసాలకు సంపెంగ నూనె అన్న చందంగా ఈ అడ్వర్‌టైస్‌మెంట్ల వ్యవహారం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

గతంలో బీహార్.. ఇప్పుడు కేరళ..

ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ ప్రభుత్వ ప్రకటనలపై వస్తున్న విమర్శలకు ప్రస్తుత సంద ర్భమే ప్రధాన కారణం. గతంలో బీహార్‌లో ఎన్నికల సమయంలో కులగణన అంశాన్ని ప్రస్తావిస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రకటనలు వెలువడటం పెద్ద చర్చకు దారితీసింది. ఆ సమయంలో కూడా ప్రజా ధనాన్ని రాజకీయ సందేశాల కోసం వినియోగిస్తున్నారనే విమర్శలు వినిపించాయి. ఇప్పుడు కేరళలో ఎన్నికల నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రకటనలు ప్రచురితమవడం మరోసారి వివాదా నికి కారణమైంది.

ఒక రాష్ట్రంలో అమలుచేస్తున్న పథకాల గురించి మరో రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ప్రచారం చేయడం వెనుక రాజకీయ ప్రయోజనాలే ఉన్నాయా అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. దీంతో ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వడం కేవలం ప్రచారమేనా.. లేక రాజకీయ సంకేతమా అన్న చర్చ మరోసారి మొదలైంది.

ప్రజల్లో అసంతృప్తి..

రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుపై ఇప్పటికే పలు విమర్శలు వినిపిస్తున్న సమయంలో ప్రభుత్వ ప్రకటనలపై భారీగా ఖర్చు చేయడం చర్చనీయాంశంగా మారుతోంది. ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ ప్రభుత్వ ప్రకటనలు వెలువడుతున్న నేపథ్యంలో ప్రజా ధనం వినియోగంపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నా యి. రాష్ట్ర ప్రజల పన్నుల ద్వారా సమకూరే నిధులను ఇతర రాష్ట్రాల్లో ప్రచారం కోసం ఖర్చు చేయడం సరైందా అనే చర్చ ప్రజల్లో ప్రారంభమైంది.

ఇప్పటికే కొన్ని సంక్షేమ పథకాల అమలులో ఆలస్యం, నిధుల కొరత వంటి అంశాలపై విమర్శలు వినిపిస్తున్న సమయంలో ప్రచా ర కార్యక్రమాలపై ఖర్చు పెరగడం ప్రజల్లో అసంతృప్తిని పెంచుతోందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రజల అవసరాలకు, సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధా న్యం ఇవ్వాల్సిన సమయంలో ప్రకటనల కోసం భారీగా నిధులు వెచ్చించడం ప్రభుత్వ ప్రాధాన్యతలపై సందేహాలు కలిగిస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రజా ధనం వినియోగంపై పారదర్శకత ఉండాలని, ప్రభుత్వ ఖర్చుల ప్రాధాన్యతపై స్పష్టత ఇవ్వాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

కొన్ని పథకాల అమలులో ఆలస్యం, నిధుల కొరత వంటి అంశాలపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతుండగా.. అదే సమయంలో ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం ప్రకటనలు ఇవ్వడం ప్రభుత్వ ప్రాధాన్యతలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకా లు, అభివృద్ధి కార్యక్రమాలను దేశవ్యాప్తంగా తెలియజేయడం ద్వారా తెలంగాణ ప్రతిష్ట పెరుగుతుందని, పెట్టుబడులు కూ డా ఆకర్షించవచ్చని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ సంక్షేమం, ప్రచారం మధ్య సమతు ల్యత ఉండాలనే చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది. 

ఇక్కడ అమలు కాని పథకాలపై.. 

తెలంగాణలోనే కొన్ని సంక్షేమ పథకాల అమలుపై ప్రశ్నలు తలెత్తుతున్న సమయంలో వాటిపైనే ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేయడం సమంజసమా అనే ప్రశ్నలు రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో అమలు విషయంలోనే స్పష్టత లేకపోయిన పథకాలపై కేరళ వంటి రాష్ట్రాల్లో ప్రకటనలు ఇవ్వడం ప్రభుత్వ ప్రాధాన్యతలపై సందేహాలు రేకెత్తిస్తోందని వారు అభిప్రాయపడుతున్నారు.

మొదట రాష్ట్రంలోనే పథకాలు సమర్థవంతంగా అమలు అయ్యేలా చూడాలి గానీ, అమలులో సమస్యలు ఉన్న కార్యక్రమాలను ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేయడం ప్రజల్లో సందేహాలకు దారి తీస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీంతో తెలంగాణలోనే సరిగా అమలుచేయని పథకాలపై ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమన్న చర్చ రాజకీయంగా కొనసాగుతోంది.

రాజకీయంగా దుమారం? 

ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ ప్రభు త్వ ప్రకటనలు వెలువడటం ఇప్పటికే రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ము ఖ్యంగా ఎన్నికలు జరుగుతున్న లేదా జరగబోయే రాష్ట్రాల్లో సంక్షేమ పథకాల ప్రచారం చేయడం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయా అన్న ప్రశ్నలు లేవనెత్తు తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై మ రింత తీవ్ర విమర్శలు చేసే అవకాశముంది. రాష్ట్ర ప్రజల పన్ను ల ద్వారా వచ్చే నిధులను ఇతర రాష్ట్రాల్లో ప్రచారం కోసం వినియోగించడం సరైంది కాదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

రాష్ట్రంలో ప్రజల సమస్యలు పరిష్కరించకుండా ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేసుకో వడం వెనుక రాజకీయ లక్ష్యా లే ఉన్నాయని ఆరోపిస్తున్నాయి. ము ఖ్యంగా రాష్ట్రంలోనే కొన్ని సంక్షేమ పథకాల అమలుపై ప్రశ్నలు వస్తున్న సమయంలో ప్రచారంపై ఖర్చు పెరగడం రాజకీయంగా ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టే అంశంగా మారవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఈ అంశాన్ని ప్రతిపక్షాలు రాజకీయం గా పెద్దఎత్తున లేవనెత్తే అవకాశముండటంతో, ప్రభుత్వ ప్రకటనల వ్యవహా రం రాబోయే రోజుల్లో మరింత దు మారానికి దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి.