15 May, 2026 | 3:28 AM

పార్టీని నమ్ముకుంటే పక్కన పెట్టిండ్రు

15-05-2026 02:16 AM
  1. కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్‌కు రాజీనామా చేస్తున్నా 
  2. మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాఘవేందర్ 

మహమ్మదాబాద్, మే 14 : పార్టీని నమ్ముకుని సేవ చేస్తే పక్కన పెట్టినరని ఇంతకంటే అవమానం ఏముంటుందని కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రాఘవేందర్ అసహనం వ్యక్తం చేశారు. గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన కాంగ్రెస్ పార్టీకి పదవికి రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ విధివిధానాలకు కట్టుబడి ఉండకుండా ఒక వర్గానికి మాత్రమే సహాయ సహకారాలు అందిస్తున్నారనికొన్ని సంవత్సరాల నుంచి ఒక వ్యక్తిని మాత్రమే కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ గా కొనసాగిస్తున్నారని విమర్శించారు.

ఒక వ్యక్తినే కొన్ని పర్యాలు పార్టీ ప్రెసిడెంట్గా గా కొనసాగించడం కొనసాగించవద్దని సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసిన పట్టించుకోకుండా మరోసారి అదే వ్యక్తికి పార్టీ పదవి అప్పగించడం సరైన నిర్ణయం కాదన్నారు.ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆలోచన ధోరణి సరైనది కాదని మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్న నేను పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నాని తెలిపారు.