సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం
డీ ఎల్ పీ ఓ సురేష్ బాబు
పాపన్నపేట,ఏప్రిల్16: గ్రామాల అభివృద్ధికి అధికారులు, నూతన సర్పంచులు సమన్వయంతో పనిచేయాలని, సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమని డీఎల్ పీ వో సురేష్ బాబు పేర్కొన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా మండల స్థాయి సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో విద్యుత్, నీటి సమస్యలు పరిష్కరించాలని సర్పంచులు అధికారులను కోరారు. అరైవ్ - అలైవ్ లో భాగంగా ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటించాలన్నారు. గ్రామ ప్రథమ పౌరులైన సర్పంచులు గ్రామ ప్రజలకు ఈ విషయంపై అవగాహన కల్పించి, రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ సతీష్ కుమార్, ఎంపీడీఓ విష్ణువర్ధన్, మండలంలోని ఆయా గ్రామాల సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.






