6 May, 2026 | 6:13 PM

క్రీడా శాఖ డిప్యూటీ డైరెక్టర్ కు ఘన సత్కారం

06-05-2026 05:40 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ డిప్యూటీ డైరెక్టర్ గుగులోతు అశోక్ కుమార్ ను పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ లోనీ సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. బుధవారం పెద్దపల్లి పర్యటనకు వచ్చిన ఆయన సుల్తానాబాద్ లో పర్యటించారు. డిప్యూటీ డైరెక్టర్ గా నియామకమైన తర్వాత తొలిసారిగా సుల్తానాబాద్ రావడంతో ఆయనకు సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ ఘన స్వాగతం పలికింది.

స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు ముస్త్యాల రవీందర్ ఆయన కు పుష్ప గుచ్చాన్ని అందించి పూలమాల, శాలువాతో ఘనంగా సత్కరించారు. చిన్న వయసులోనే డిప్యూటీ డైరెక్టర్ గా పదోన్నతి పొంది యువ క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఈ సందర్భంగా అశోక్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో క్రీడా రంగాన్ని అభివృద్ధి చెందేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్నారన్నారు. అందులో భాగంగానే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నెలకొల్పుతున్నట్లు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో క్రీడలకు కంచుకోట సుల్తానాబాద్ అని కొనియాడారు. ఇక్కడి నుంచి ఎందరో క్రీడారంగంలో ఉన్నత స్థాయికి ఎదిగారని జాతీయ , అంతర్జాతీయ స్థాయిలో రాణించిన ఘనత సుల్తానాబాద్ కి దక్కిందనీ అన్నారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ కార్యదర్శులు , ఉపాధ్యక్షులు అమిరిశెట్టి తిరుపతి, అంతటి శంకరయ్య, బైరగోని రవీందర్ గౌడ్, తెలంగాణ ఒలంపిక్ సంఘం సభ్యులు సిలివేరి మహేందర్, ఖేలో ఇండియా కోకో కోచ్ గెల్లు మధుకర్ యాదవ్, శెట్టి శ్రీనివాస్, సిలివేరి రాము, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.