10 May, 2026 | 11:35 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

నాగోబా జాతర రావాలని డిప్యూటీ సీఎంకు ఆహ్వానం

07-01-2026 12:28 AM

నేడు పవిత్ర గంగా జలాన్ని సేకరించనున్న మెస్రం వంశీయులు

ఆదిలాబాద్/ఉట్నూర్, జనవరి 6 (విజయక్రాంతి): దేశంలో రెండవ అతిపెద్ద గిరిజన జాతరగా, రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన నాగోబా జాతర సందర్భంగా నిర్వహించే ప్రజా దర్బార్ కు హాజరుకావాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ను ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావు ఆహ్వాన పత్రిక అంద జేశారు. మంగళవారం రాష్ట్ర రాజధానికి వెళ్లిన మెస్రం వంశీయులు డిప్యూటీ సీఎంతో పాటు జిల్లా ఇంచార్జీ మంత్రులు జూపల్లి కృష్ణారావు, మంత్రి సీతక్క, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు వేం నరేందర్ రెడ్డిని కలిసి ఆహ్వాన పత్రికలు అందించారు.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ... నాగోబా జాతర సందర్భంగా ఈనెల 22న నిర్వహించే దర్బార్ కు  తప్పకుండా హాజరవుతానని హామీ ఇచ్చినట్లు ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావు, ఆలయ కమిటీ చైర్మన్ మెస్రం ఆనంద రావు, సర్పంచ్ తుకారాం లతో పాటు మెస్రం వంశీయులు తెలిపారు. 

నేడు పవిత్ర గంగా జలం సేకరణ...

మరోవైపు పవిత్ర గంగ నీళ్ల కోసం బయలుదేరిన మెస్రం వంశస్థులు జన్నారం మండలంలోని కలమడుగు వద్ద గల గోదావరి నదికి నేడు చేరుకుంటారు. బుధవారం ఉద యం గంగమ్మ తల్లికి మెస్రం వంశీయులు ప్రత్యేక పూజలు చేసి, పవిత్ర గంగా జలాన్ని సేకరించనున్నారు. సేకరించిన గంగా జలంతో కేస్లాపూర్ నాగోబా ఆలయానికి తిరుగు ప్రయాణం కానున్నారు.