10 May, 2026 | 10:17 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

ప్రజల గొంతుక ‘విజయక్రాంతి’ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

07-01-2026 12:27 AM

వాస్తవాలకు నిలువుటద్దం: కొండకల్లా నరేందర్ రెడ్డి

మణికొండ, జనవరి 6 (విజయక్రాంతి): సమాజంలో వాస్తవాలను నిర్భయంగా వెలికితీస్తూ, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ’విజయ క్రాంతి’ పనిచేస్తోందని మణికొండ మాజీ  వైస్ చైర్మన్ కొండకల్లా నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మణికొండలో ’విజయ క్రాంతి’ నూతన క్యాలెండర్ను మాజీ కోఆప్షన్ సభ్యులు జొన్నాడ సిద్ధప్ప, బీజేపీ కార్యకర్తలతో కలిసి ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పత్రికపై ప్రశంసల జల్లు కురిపించారు. విజయ క్రాంతి కేవలం పత్రిక మాత్రమే కాదని, అది సామాన్య ప్రజల గొంతుక అని అభివర్ణించారు. ఇందులోని ప్రతి అక్షరం ప్రజల పక్షాన నిలబడుతుందని, నిష్పక్షపాత వార్తలకు ఇది చిరునామా అని స్పష్టం చేశారు. వాస్తవాలు తెలుసుకోవాలంటే పాఠకులు విజయ క్రాంతి చూడాల్సిందేనని ఆయన సూచించారు. సమాజ హితం కోరే ఇటువంటి పత్రికలకు తమ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని జొన్నాడ సిద్ధప్ప తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ శ్రేణులు క్యాలెండర్ ఆవిష్కరణ పట్ల హర్షం వ్యక్తం చేశారు.