6 March, 2026 | 9:08 PM

రాష్ట్రంలో రాక్షస పాలన

06-03-2026 01:32 AM
  1. రెండున్నరేళ్లలోనే 2 వేలకుపైగా రేప్ కేసులు 
  2. ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీస్తాం
  3. బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి

హైదరాబాద్, మార్చి 5 (విజయక్రాంతి): రాష్ట్రంలో గత రెండున్నరేళ్లలో 2 వేలకుపైగా లైంగికదాడి కేసులు నమోదయ్యాయని, ఇది మహిళల భద్రత పరిస్థితి తీవ్రతను అద్దంపడుతోందని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి పేర్కొన్నారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం మహిళల సాధికారత కోసం కృషి చేస్తుంటే, మరోవైపు రాష్ట్రంలో మహిళల పట్ల రాక్షస పాలన కొనసాగుతోందని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసి న మీడియా సమావేశంలో ఆమె మాట్లాడా రు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో మార్చి 6న సోమాజిగూడలోని కత్రియా హోటల్లో ఘనంగా ఉమెన్స్ డే వేడుకలు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు.

ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన గ్యారంటీలు, హామీలను అమ లు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలు, విద్యార్థినులకు భద్రత లేకుండా పోయిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై మహిళా మోర్చా ఆధ్వర్యంలో బలమైన పోరాటం కొనసాగిస్తామని, మహిళల భద్రత, హక్కుల పరిరక్ష ణ కోసం ప్రభుత్వంను నిలదీస్తామని స్పష్టం చేశారు. మార్చి 6న నిర్వహించనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో మహిళలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.