6 June, 2026 | 8:21 PM

సీడ్ బాల్స్ లో దేమికలాన్ ఆదర్శం

06-06-2026 07:13 PM

తాడ్వాయి,(విజయక్రాంతి): సీడ్ బాల్స్ వేయడంలో దేమికలాన్ జిల్లాలోనే ఆదర్శంగా నిలిచిందని మండల ప్రత్యేక అధికారి రఘునందన్ తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేమి కలాన్ గ్రామంలో శనివారం ఆయన సీడ్ బాల్స్ వేసిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ శివారులోని బైరన్ గుట్ట ఏరియాలో సుమారు 500 సీడ్ బాల్స్ ని అటవీ ప్రాంతంలో వేయడం జరిగిందన్నారు.

సర్పంచ్ బైరవి కృషిని ఆయన కొనియాడారు.భైరవి చేస్తున్న కృషి జిల్లాకే ఆదర్శంగా నిలిచిందన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించడంలో ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. గ్రామపంచాయతీ పాలవర్గం ఆధ్వర్యంలో చేసిన కృషి అందరికీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపిడిఓ సవితా రెడ్డి, సర్పంచ్ బైనవి, ఉపసర్పంచ్ గంగయ్య, సాంకేతిక సహాయకులు కృష్ణాగౌడ్,కార్యదర్శి అనిల్ తదితరులు పాల్గొన్నారు.