18 April, 2026 | 7:00 PM

మహిళా బిల్లుకు ఆమోదం - డీలిమిటేషన్ వద్దు

18-04-2026 05:39 PM

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్

ఖమ్మం,(విజయక్రాంతి): డీలిమిటేషన్ సవరించి అన్ని పార్టీల ఆమోదంతో బిల్లును ప్రవేశపెట్టాలని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ అన్నారు.  ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరులన విలేకరుల సమావేశంలో పార్లమెంట్ లో జరిగిన సంఘటన లో భాగంగా మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్ బిల్లు రెండింటిని బిజెపి మోడీ ప్రభుత్వం హడావుడిగా దొడ్డిదారిన నెగ్గించేందుకు, మోసపూరిత ఆలోచన చేసి బిల్లును పాస్ చేయించుకునేందుకు కుట్ర పన్నింది అని వారు ఆరోపించారు.

ఇట్టి బిల్లును కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు శ్రీ రాహుల్ గాంధీగారి నేతృత్వంలో అన్ని విపక్ష పార్టీల ను కలుపుకొని జరిగే నష్టాన్ని వ్యతిరేకిస్తూ, విపక్ష పార్టీలను దేశంలో అన్ని రాష్ట్రాల పరిస్థితులను  దృష్టిలో పెట్టుకొని దక్షిణాది రాష్ట్రాలకి, చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా అందరి అభిప్రాయాలను సేకరించి, వారి సలహాలు  తీసుకొని బిల్లు పెడితే ఎవరికి నష్టం జరుగ కుండా చూడాలని వారు అన్నారు. గతంలోనే 2023లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు రాష్ట్రపతి గారి ఆమోదముద్ర పొందింది. వారు సంతకం చేశారు.

అట్టి ఆమోదముద్ర పొందిన బిల్లును మరలా తీసుకొచ్చి విపక్ష పార్టీల ను మరియు దేశ ప్రజలను మోసం చేసే విధంగా ఎన్ డి ఏ వారు కుట్ర పన్నారు అని వారు దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కల్వకుంట్ల గోపాలరావు , జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు  తూములూరి లక్ష్మీ నరసింహారావు, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కిలారు అనిల్ కుమార్, నగర కాంగ్రెస్ అధికార ప్రతినిధులు బూర్లె  లక్ష్మీనారాయణ, ఏలూరు శ్రీనివాసరావు గార్లు  విలేకరుల సమావేశంలో మాట్లాడారు.