18 April, 2026 | 7:00 PM

కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ లో చలివేంద్రాలు ప్రారంభం

18-04-2026 05:42 PM

ప్రజల దాహర్తి తీర్చడమే లక్ష్యం: మేయర్ గణేష్

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): పెరుగుతున్న ఎండల కారణంగా ప్రజలు దాహార్తితో ఇబ్బంది పడకుండా ఉండేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ 3 గణేష్ అన్నారు. శనివారం కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలుచోట్ల చలివేంద్రాలను ఆయన ప్రారంభించారు.

పాల్వంచలోని ముఖ్యకూడలలో  1) పాల్వంచ మునిసిపల్ ఆఫీస్ ముందు, 2) KSP రోడ్డు లో అంబేద్కర్ సెంటర్లో, 3) దమ్మపేట సెంటర్లో, 4) బస్టాండ్ దగ్గర, కొత్తగూడెంలోని రామవరం, హెడ్ ఆఫీస్, పోస్ట్ ఆఫీస్ సెంటర్, బస్టాండ్ ఆటో స్టాండ్, రైల్వే స్టేషన్, మార్కెట్ ప్రాంతాల్లో చలివేంద్రం లు వేర్పాటు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులు కొత్తగూడెం కార్పొరేషన్  మేయర్ ఎం.గణేష్ ఇట్టి కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ లలిత కుమారి ఆయా డివిజన్ కార్పొరేటర్  సాయిబాబా, అన్నపూర్ణ, భవిత, నామ కీర్తి, జీ వి ఆర్, వీసంశెట్టి విశ్వం, రావి రాంబాబు, కనుకుంట్ల శ్రీను, నరేష్  పట్టణ ప్రముఖులు, ఏఈ రాము పాల్గొన్నారు.