4 July, 2026 | 9:31 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

అంకితభావమే సంస్థ పురోగతికి పునాది

26-11-2025 12:00 AM
  1. ఏఎంఆర్ ఎనిమిదవ వార్షికోత్సవం 

క్రీడా విజేతలకు వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి బహుమతుల పంపిణీ 

కాటారం (మలహర్), నవంబర్ 25 (విజయక్రాంతి) : కార్మికుల అంకితభావమే సం స్థ పురోగతికి పునాది అవుతుందని ఏఎంఆర్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి అన్నా రు. ఏ ఎం ఆర్ కోల్ మైనింగ్ కంపెనీ ఎనిమిదో వార్షికోత్సవం సందర్భంగా కంపెనీ ఎండి మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచర్ల ఓసిపి ఆవరణలో అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించారు.

తాడిచర్ల లోని ఓసిపి కో ల్ మైన్ లో కార్మికులకు వివిధ రంగాల్లో ఆటల పోటీలను నిర్వహించారు. గత పదిహేను రోజులుగా నిర్వహించిన వివిధ క్రీడా పోటీల లో గెలుపొందిన విజేతలకు, ఉత్తమ ఉద్యోగులకు ఏ ఎం ఆర్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి, సీనియర్ జనరల్ మేనేజర్ కే ఎస్ ఎన్ మూర్తి లు బహుమతులు అందజేశారు. ప్రశంసా పత్రాలను అందజేసి ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో మైన్ మేనేజర్ శ్రీనివాస్, సేఫ్టీ ఆఫీసర్ సురేష్ బాబు, ఫిట్ ఇంజనీర్ కిషన్, వెల్ఫేర్ ఆఫీసర్ రమేష్ బాబు, ఏఎంఆర్ కంపెనీ అధికారులు విశ్వ ప్రసాద్, సర్వోత్తమ్, హెచ్‌ఆర్ డి జి ఎం రమేష్ బాబు,కార్మికులు అధిక సంఖ్యలోపాల్గొన్నారు.