7 April, 2026 | 9:33 PM

కొనసాగుతున్న వార్డు సభ్యుల శిక్షణా తరగతులు

07-04-2026 07:32 PM

నాగల్ గిద్ద: గ్రామాలు అభివృద్ధికి పట్టుకొమ్మలు వార్డు సభ్యులేనని ఎంపీడీవో మహేశ్వర రావు అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో 33 గ్రామ పంచాయతీల పరిధిలోని వార్డు సభ్యులకు సోమవారం నుండి 2వ విడత శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి.ఈ క్రమంలో 50 మంది వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం వార్డు సభ్యుల అధికారాలు, గ్రామ అభివృద్ధికి చేపట్టవలసిన విధుల గురించి వివరించారు. ఈ క్లాసులు మండల అభివృద్ధి అధికారి మహేశ్వర రావు, మండల పంచాయతీ అధికారి, పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల వార్డు సభ్యులు, కార్యదర్శులు పాల్గొన్నారు.