జీవీఆర్ జన్మదిన వేడుకలు
07-04-2026 07:19 PM
ముకరంపుర,(విజయక్రాంతి): భారత రాష్ట్ర సమితి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు, సుడా మాజీ చైర్మన్ జీవి రామకృష్ణారావు జన్మదిన వేడుకలు శాతవాహన యూనివర్సిటీ బీఆర్ఎస్ ఇన్చార్జి చుక్క శ్రీనివాస్ ఆధ్వర్యంలో శాతవాహన యూనివర్సిటీలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మజ్జిగ ప్యాకెట్లు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వి నగర అధ్యక్షుడు బొంకురి మోహన్ , ఎస్ ఆర్ ఆర్ కళాశాల అధ్యక్షుడు నాయిని అన్వేష్, విక్రమ్, శ్రీకాంత్, శివ, మహేశ్వరి, అశ్విత రెడ్డి, నందు, బిందు, రమ్య, మహిమాన్విత, రజిత, దివ్య తదితరులు పాల్గొన్నారు.




