నూతన రేషన్ దుకాణం ప్రారంభించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య
07-04-2026 07:12 PM
టేకులపల్లి,(విజయక్రాంతి): టేకులపల్లి మండలం బిల్లుడుతండా గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన రేషన్ దుకాణాన్ని ఎమ్మెల్యే కోరం కనకయ్య మంగళవారం ప్రారంభించారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రతీ పేదవాళ్లకు ప్రభుత్వం అండగా ఉంటూ ప్రజలకు మంచి పరిపాలన అందిస్తున్నారు.
ప్రతీ పేదవాడు కూడా సన్న బియ్యం తినాలి అనే ఆలోచనతో రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామని, నేడు ఉన్నోడు, లేనోడు అనే తేడా లేకుండా పేద కుటుంబాలు సైతం సన్నబియ్యం అన్నం తినేలా వారి మనస్సులో పేదవాళ్ళు అనే భావం లేకుండా సంతోషాన్ని నింపుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.




