7 April, 2026 | 9:33 PM

ఈ తహసిల్దార్ మాకొద్దు. కలెక్టర్ సారూ

07-04-2026 07:42 PM

గ్రావెల్, ఇసుక మాఫియాను అరికట్టలేని 

 తాసిల్దార్ను వెంటనే బదిలీసెయ్యండి

 గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం డిమాండ్

చర్ల,(విజయక్రాంతి): మండలంలో ప్రజల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న తహసిల్దార్ శ్రీనివాసరావును వెంటనే బదిలీ చేయాలని గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ డిమాండ్ చేశారు. మంగళవారం  ఆయన మాట్లాడుతూ... 'ఈ తహసీల్దార్ మాకొద్దు' అంటూ ప్రెస్ నోట్ విడుదల చేశారు.

 ప్రజల సమస్యలు పక్కనపెట్టి, అక్రమార్కులకు అండగా నిలుస్తూ, సమస్యలపై వినతిపత్రాలు ఇచ్చినా స్పందించకపోవడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. చర్ల తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దారుగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావును తక్షణమే అక్కడి నుండి బదిలీ చేయాలని మొన్న జరిగిన తాసిల్దారుల బదిలీల్లో చర్ల తాసిల్దార్ ను కూడా జిల్లా కలెక్టర్  బదిలీ చేసి ఉంటే బాగుండేదని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

షెడ్యూల్ ప్రాంతమైన చర్లలో అనేక అక్రమాలు గ్రావెల్ మట్టి ఇసుక అలాగే   ఎల్ టి ఆర్ 1/70 చట్ట వ్యతిరేకంగా ప్రభుత్వ భూములలో అక్రమాలు జరుగుతున్నాయని మండల మేజిస్ట్రేట్ కు ఆదివాసి సంఘాలు ఫిర్యాదు చేస్తే  పక్కన పెట్టి ,ఇచ్చిన ఫిర్యాదులు నెలలు గడుస్తున్న  ఏమాత్రం పరిష్కారం చేయడం లేదన్నారు. జిల్లా కలెక్టర్ కూడా షెడ్యూల్ ప్రాంతంలో పనిచేస్తున్న తాసిల్దారులకు చట్టాల అమలు కు దిశ నిర్దేశించడం చాలా అవసరమని ఏజెన్సీలో గిరిజన చట్టాలు మొత్తం రెవిన్యూ పంచాయతీ సెక్రెటరీల  కను సన్నలోనే  నిర్వీర్యం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.