ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సహకారంతో విద్యుత్ సమస్యలు పరిష్కారం
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని నాగిరెడ్డిపేట గ్రామంలో కొన్ని రోజుల క్రితం గాలి వల్ల విద్యుత్ స్తంభాలు నేలకోరిగాయి. గ్రామస్తులకు కొంతమేర ఇబ్బందులు కలగడంతో ఇట్టి విషయంపై స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు దృష్టికి తీసుకెళ్లారు. దీనితో వెంటనే విద్యుత్ శాఖ అధికారులు నాగిరెడ్డిపేట గ్రామానికి గ్రామానికి చేరుకొని విద్యుత్ సమస్యలను పరిష్కరించి మరమ్మత్తులు చేశారు.
నేలకొరిగిన విద్యుత్ స్తంభాల వద్ద నూతన స్తంభాలను ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించారు. దీనితో గ్రామ సర్పంచ్ మన్నే వెంకట్ స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు విద్యుత్ శాఖ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మన్నె వెంకట్, విద్యుత్ శాఖ ఏఈ నాగరాజ్, లైను ఇన్స్పెక్టర్ సురేందర్, లైన్మెన్ కృష్ణ తదితరులు ఉన్నారు.




