31 July, 2026 | 9:25 PM

ఎమ్మెల్యే చొరవతో బాలాజీ నగర్ ప్రమాదకర గుంతలో మట్టి నింపివేత

31-07-2026 08:09 PM

ఇల్లందు,(విజయక్రాంతి): ఇల్లందు మండలంలోని బాలాజీ నగర్ గ్రామపంచాయతీ ప్రధాన రహదారి పక్కన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం కోసం తవ్విన లోతైన గుంత ప్రజలకు ప్రమాదకరంగా మారడంతో గ్రామ సర్పంచ్ పాయం స్వాతి, కార్యదర్శి కార్తీక్ ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య దృష్టికి సమస్యను తీసుకెళ్లారు.

వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సింగరేణి జీఎంతో మాట్లాడి గుంతలో మట్టి నింపించాలని ఆదేశించడంతో శుక్రవారం పనులు ప్రారంభమయ్యాయి. గుంతను పూర్తిగా పూడ్చేలా మట్టి వేసి సమతలీకరణ చేపడుతున్నారు. దీంతో బాలాజీ నగర్, సంజయ్ నగర్, ఆజాద్ నగర్ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారని, వెంటనే స్పందించి ప్రమాదాన్ని నివారించిన ఎమ్మెల్యే కోరం కనకయ్యకు సర్పంచ్ పాయం స్వాతి కృతజ్ఞతలు తెలిపారు.