ఎస్‌ఐఆర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య
31-07-2026 08:12 PM
ఇల్లందు,(విజయక్రాంతి): ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని రాజస్థాన్ ఫంక్షన్ హాల్‌లో ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియపై ఐదు మండలాల అఖిలపక్ష నాయకులతో అధికారులు నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మండలాల వారీగా ఎస్‌ఐఆర్ పురోగతిని వివరించారు.
ఇంకా పూర్తికాని ఎన్యుమరేషన్ ఫారాలను త్వరితగతిన పూర్తి చేసి ఓటరు జాబితా సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను ఇల్లందు నియోజకవర్గంలో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. అలాగే ఎన్యుమరేషన్ ఫారాల పూర్తి ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏలు పూర్తి సహకారం అందిస్తారని తెలిపారు.






