11 August, 2026 | 4:50 AM

తీజ్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

11-08-2026 01:17 AM

ఉప్పల్ ఆగస్టు 10 విజయక్రాంతి: చర్లపల్లి డివిజన్ పరిధిలోని మారుతి కాలనీ, చక్రిపురం ప్రాంతంలో ఘనంగా నిర్వహించిన తీజ్ వేడుకల్లో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొని మహిళలు, యువతతో కలిసి ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తీజ్ పండుగ దేశ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. మహిళల ఐక్యత, ఆనందోత్సాహాలకు ప్రతిబింబంగా జరిగే ఇలాంటి పండుగలను ప్రతి ఒక్క రూ సోదరభావంతో నిర్వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహేష్ గౌడ్, మహేందర్, శ్రీశైలం, ప్రసాద్ రెడ్డి, సు ధాకర్, శ్రీను, వెంకటేష్, శ్రీకాంత్, రవి, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.