యాదాద్రిలో ఎమ్మెల్యే మల్లారెడ్డి పూజలు
11-08-2026 01:16 AM
యాదగిరిగుట్ట, ఆగస్టు ౧౦(విజయక్రాంతి): యాదగిరిగుట్టలో సోమవారం నిత్య పూజలు నిర్వహించారు. స్వామివారి ఆలయంలో ఉదయం సుప్రభాత సేవతో గర్భగుడిలో కొలువుదీరిన స్వయంభులను సువర్ణ ప్రతిష్ట మూర్తులను వేదమంత్రోచరణలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలతో అభిషేకించి తులసీదళాలతో అర్పించారు. ప్రాకారమంటపంలో నృసింహ హోమం, నిత్య కళ్యాణంను వైభవంగా నిర్వహించారు. కాగా స్వామివారిని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు వేద శీర్వచనం చేశారు. స్వామి వారి లడ్డు ప్రసాదంను ఆలయ అధికారులు ఆయనకు అందజేశారు.






