calender_icon.png 14 February, 2026 | 1:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా 2కే 26 కల్చరల్ ఫెస్ట్

14-02-2026 12:09:37 AM

సిద్ధార్థ ఇనిస్టిట్యూట్‌లో కార్యక్రమ నిర్వహణ

హైదరాబాద్, ఫిబ్రవరి 13(విజయక్రాం తి) : సిద్ధార్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో టెక్ వర్ణం 2కే 26 కల్చరల్ ఫెస్ట్‌ను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా దేశంలోని వివిధ రాష్ట్రాల సాంప్రదాయాలను, సాంప్రదాయ నృత్యాలను, వారి జీవన విధానం, ఆహార అలవాట్లు అన్నింటిని ప్రస్ఫుటంగా డిపార్ట్‌మెంట్ హెచ్‌ఓడీ, అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించారు.

హ్యుమానిటీ అండ్ సైన్స్ ఆధ్వర్యంలో జరిపిన తెలంగాణ బోనాలు, బతుకమ్మ పండుగ, పోతురాజుల ఆటలు, అలాగే ఈసీఈ డిపార్ట్‌మెంట్ నిర్వహించిన సంక్రాంతి పండుగలో పిల్లలకు భోగి పండ్లు, కోళ్ల పందాలు నిర్వహించగా అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే సీఎస్‌డీ జరిపిన రాజస్థాన్ ఒంటె స వారి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి.

సీఎస్సీవారు గుజరాత్ సాంప్రదాయాన్ని, సీఎస్ ఎం తమిళనాడు, పంజాబ్ సాంప్రదాయాలను, ట్రిపుల్ ఈ తమిళనాడు, మహారాష్ట్ర సాంప్రదాయాలను, సివిల్ కేరళ సాంప్రదాయాలను, మెకానికల్ అస్సాం సాంప్రదా యాలను ప్రదర్శించారు.

వాటిని కళాశాల సెక్రటరీ డాక్టర్ ప్రదీప్ కుమార్, డైరెక్టర్ జి భగత్, ప్రిన్సిపల్ డాక్టర్ పి శేఖర్ బాబు వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సుబ్బారావులుఅన్ని స్టాల్స్ ని తిరిగి వారి సాంప్రదాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరంసాంస్కృతి కా ర్యక్రమంలో భాగంగా భరతనాట్యం, కూచిపూడి, కథాకళి, బాంద్రా గూమర్ బిహు మరియు వివిధ నృత్యాలను అద్భుతంగా ప్రదర్శించారు.