10 March, 2026 | 8:52 AM

పశ్చిమాసియా వివాదంపై రాజ్యసభలో జైశంకర్ ప్రకటన

09-03-2026 12:11 PM

శాంతికి ఎలాంటి విఘాతం కలిగినా.. మొత్తం ప్రపంచంపై ప్రభావం

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో పరిస్థితులపై( West Asia conflict) విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్(External Affairs Minister S Jaishankar) సోమవారం రాజ్యసభలో ప్రకటన చేశారు. పశ్చిమాసియాలోని పరిస్థితులను ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) పర్యవేక్షిస్తున్నారని జై శంకర్ పేర్కొన్నారు. శాంతికి ఎలాంటి విఘాతం కలిగినా ప్రపంచం మొత్తం ప్రభావం ఉంటుందని ఆయన తెలిపారు.

సంబంధించిన శాఖలన్నింటికీ తగిన చర్యలు తీసుకోవాలని సూచించామని పేర్కొన్నారు. గల్ఫ్ దేశాల్లో(Gulf countries) నివసిస్తున్న భారతీయుల రక్షణకు చర్యలు  చేపట్టామని జైశంకర్ సూచించారు. పశ్చిమాసియాలో పరిస్థితులు తీవ్ర ఆందోళనలు కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. యుద్ధ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని వెల్లడించారు. చర్యలు, దౌత్యపరంగా సమస్య పరిష్కారమవుతుందని భారత్ నమ్ముతుందని తెలిపారు. పశ్చిమాసియాలో చిక్కుకున్న భారతీయులను వెనక్కి రప్పించే చర్యలు చేపట్టామని జైశంకర్ స్పష్టం చేశారు. భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటోందని విదేశాంగ మంత్రి ప్రకటించారు.