15-02-2026 05:21:41 PM
వాంకిడి,(విజయక్రాంతి): మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మండల కేంద్రంలోని శివకేశవాలయం భక్తుల సందడితో కిటకిటలాడింది. ఆదివారం కావడంతో మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాలు, సుదూర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో శివకేశవులకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం చిక్లీ నది తీరాన జరుగుతున్న జాతరకు భక్తులు పోటెత్తడంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా వాంకిడి ఎస్ఐ మహేందర్ ఆధ్వర్యంలో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా పోలీసులు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తూ జాతర పరిసరాలను పర్యవేక్షించారు.