calender_icon.png 15 February, 2026 | 7:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేతికే "పుర పగ్గాలు"

15-02-2026 05:25:23 PM

- మెజార్టీ స్థానాల హస్తగతం

- స్వతంత్రులు యూటర్న్

-  మారిన సమీకరణలు

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. నాటకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి తమ బలాన్ని సమకూర్చుకున్నట్టు తెలుస్తుంది. బెల్లంపల్లి పురపగ్గాలు హస్తం చేతికి వచ్చినట్టే అని పరిశీలకులు భావిస్తున్నారు. అంగబలం అర్ధబలం ప్రదర్శించి స్వతంత్ర అభ్యర్థుల మద్దతును కూడగట్టుకున్నట్టు తెలుస్తుంది. స్వతంత్రులు అయిదుగురిలో నలుగురు, బీజేపీ  కౌన్సిలర్ కాంగ్రెస్ క్యాంపులోకి వెళ్లినట్టు తెలుస్తుంది. దీంతో గులాబీ పార్టీ తన చేతికి వచ్చినట్టే వచ్చిన మెజార్టీ నీ  అనూహ్యంగా కోల్పోయింది.

తాజా సమీకరణల నేపథ్యం లో కాంగ్రెస్ కు పూర్తి మెజార్టీ వచ్చినట్టని తెలుస్తుంది. మునిసిపల్ ఎన్నికల్లో జంప్ జిలానీల హవా కొనసాగుతున్నది. మెజార్టీ కోసం ఈ సమయంలో సుబ్బిని కూడా  సుబ్బమ్మ అని మర్యాదగా పిలిచే పరిస్థితి ఇది. పీఠం కోసం ప్రధాన పార్టీలు పడరాని పాట్లు పడుతున్నారు. కాంగ్రెస్ క్యాంపులో సంక్షోభం సృష్టించిన ఆ పార్టీ నేత చిప్ప మనోహర్ మైండ్ గేమ్ అడ్డం తిరిగింది. ముగ్గురి సభ్యులను ఒక బీజేపీ క్యాండెట్ ను ఆయన కెటిఆర్ వద్దకు పంపించిన విషయంపై ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆగ్రహంతో ఉన్నారు.

ఈ పరిణామాలు ఒక్కసారిగా కాంగ్రెస్ ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. పార్టీ తరుపున చిప్ప అర్చన గెలుపొందారు. చైర్మన్ పీఠం  ఇస్తే సరి లేదంటే పార్టీ ఫిరాయింపు తప్పదని ఆయన  ముగ్గురిని గులాబీ గూటికి పంపించారు. కాంగ్రెస్ కు డమీకిచ్చారు. ఈ విషయం కాంగ్రెస్ లో రాజకీయ దుమారం లేపింది. ఈ సంఘటనతో చిప్ప మనోహర్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది.  బీ ఆర్ ఎస్ క్యాంపులోకి ముగ్గురిని పంపించి తీవ్ర విమర్శల్ని మూటకట్టుకున్నారు. దీన్ని ఛాలెంజ్ తీసుకుని ఎమ్మెల్యే గడ్డం వినోద్ అనూహ్యమైన చక్రం తిప్పినట్టు సమాచారం.

- చేతికి చేరిన స్వతంత్రులు

పార్టీ ఫిరాంపుకు పాల్పడిన స్వతంత్రులు  మద్దతును కాంగ్రెస్ సంకూర్చున్నదిని తెలుస్తోంది. స్వతంత్రుల ఐదుగురీలో 4 బీజేపీ కౌన్సిలర్ కాంగ్రెస్ క్యాంప్ కు మారినట్టు సమాచారం. బీ ఆర్ ఎస్ లో చేరిన 26 వార్డు కౌన్సిలర్ కుమాస్వామి తిరిగి సొంత గూటికి చేరినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ లో చేరిన మాజీ వైస్ చైర్మన్ శంకర్ సింగ్ తో కూడా చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. అవి ఫలించకపోయినా , ఇప్పటికీ కాoగ్రెస్ కు తగిన మెజార్టీ స్థానాలు ఉన్నట్టే. పీఠం కోసం పాకులాడి సొంత పార్టీలో అవిశ్వాన్ని మూటకట్టుకున్న చిప్ప మనోహర్ ను దారిలో పెట్టారు. కాంగ్రెస్లో తలెత్తిన సంక్షోభం మెల్లగా సమిసిపోయింది.

బెల్లంపల్లి చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు కాంగ్రెస్ పూర్తి బలాన్ని సమకూర్చుకున్నది. నయానో..నయానో మెజార్టీ సభ్యుల్ని సమకూర్చుకున్నది. మొత్తానికి బెల్లంపల్లి బల్దియా పై హస్తం జెండా ఎగరడం ఖాయమని కాంగ్రెస్ శ్రేణులు ధీమాతో ఉన్నారు. కాంగ్రెస్ బలం పెరగడంతో క్యాంపు కొత్త ప్రాంతానికి మార్చి నట్టు సమాచారం. ఉన్న బలాన్ని కంటికి రెప్పలా కాపాడుకుని బెల్లంపల్లి మునిసిపల్ పై  కాంగ్రెస్ జెండాను ఎగరేసి సీఎం రేవంత్ రెడ్డి ముందు తన సత్తాను ఏంటో చూపించాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ తహతహలాడుతున్నారు.