19 August, 2026 | 4:28 AM

ఆరుతడి పంటలు పండించాలి

19-08-2026 12:07 AM

గుమ్మడిదల, ఆగస్టు 18 : రానున్నరోజుల్లో ఎలినినో ప్రభావం కారణంగా వర్షాలు తగ్గి నీరు అడుగంటిపోయే  అవకాశం వున్నందున రైతులు అరుతడి పంటలైన పెసర్లు, మినుములు, జొన్నలు, కూరగాయలు పంటలు వేసుకోవాలని మంగళవారం మండల వ్యవసాయ అధికారి డి.శ్రీనివాసరావు సూచించారు.

ఇందుకు అనుగుణంగా మండలంలోనీ రైతు వేదికలో సబ్సిడీపై పెసర విత్తనాలు అందుబాటులో వున్నాయని, నాలుగు కిలోల బ్యాగు పూర్తి ధర 544 రూపాయలు ఉండగా సబ్సిడీ పోను 304 రూపాయలకు ఈ బ్యాగు అందించడం జరుగుతుందన్నారు. ఆసక్తి గల రైతులు తమ పట్టేదార్ పాసుబుక్, ఆధార్ జిరాక్స్ తీసుకొని గుమ్మడిదల రైతు వేదికలో తీసుకోవాలని, ప్రస్తుతం 25 బ్యాగులు అందుబాటులో ఉన్నాయన్నారు.