19 August, 2026 | 5:20 AM

ఘనంగా జిల్లా స్థాయి అథ్లెటిక్స్ సెలెక్షన్స్‌ప్రారంభం

19-08-2026 12:07 AM

విజేతలు ఈనెల 26, 27న వరంగల్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత

చర్ల,  ఆగస్టు 18, (విజయక్రాంతి): చర్ల పోలీస్ క్రీడా మైదానంలో మంగళవారం జిల్లా స్థాయి అథ్లెటిక్స్ సెలెక్షన్స్ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఒలంపిక్స్ జెండాను ఊపి పరుగుపందెం పోటీలను చర్ల సీఐ ఆలేం రాజు వర్మ, ఎస్త్స్ర నర్సిరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కే. మహీధర్ పాల్గొని మాట్లాడుతూ, జిల్లా హెడ్ క్వార్టర్లో తప్ప ఇటువంటి క్రీడా మైదానం ఎక్కడా లేదన్నారు.

ఇక్కడ నిర్మించిన 400 మీటర్ల ట్రాక్ అండ్ ఫీల్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంతో అనువుగా ఉందని అన్నారు. ఇటువంటి మైదానాన్ని అందించిన పోలీస్ శాఖకు, సీఐ రాజు వర్మ, ఎస్త్స్రలు నర్సిరెడ్డి, కేశవ్లకు, స్థానిక ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సెలెక్షన్స్లో గెలుపొందిన క్రీడాకారులు ఈ నెల 26, 27 తేదీల్లో వరంగల్లో జరిగే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు అర్హత సాధిస్తారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీ ఈశ్వర్ శ్రీను, ఏఎస్‌ఓ పీడీ కే. వెంకటనారాయణ, జిల్లా అథ్లెటిక్స్ కోచ్లు నాగరాజు, ప్రసాద్, టీఈటీ రవీందర్ తో పాటు పలువురు కోచ్లు పాల్గొన్నారు.