29 March, 2026 | 12:41 AM

కరపత్రం ఆవిష్కరణ

28-03-2026 10:48 PM

ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) కరీంనగర్ జిల్లా సిల్వర్ జూబ్లీ ఉత్సవాల కరపత్రం ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం రాజమల్లు మాట్లాడుతూ తెలంగాణ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) కరీంనగర్ మునిసిపాలిటిలో యూనియన్ స్థాపించి 25 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా "సిల్వర్ జూబ్లి" ఉత్సవాలు జిల్లా కేంద్రంలో ఏప్రిల్ 22, 23న నిర్వహిస్తున్నామని, కార్మికుల అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.