29 March, 2026 | 12:37 AM

ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్, ఆర్వో ప్లాంట్ ప్రారంభం

28-03-2026 10:59 PM

హనుమకొండ,(విజయక్రాంతి): హనుమకొండ జులైవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం యూత్ ఫర్ సేవా, అమెరికన్ టెలిఫోన్ అండ్ టెలిగ్రాఫిక్ కార్పొరేట్ సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన నూతన కంప్యూటర్ ల్యాబ్, ఆర్వో నీటి ప్లాంటును శనివారం ఏటి అండ్ టీ కార్పోరేట్ సంస్థ ప్రతినిథి రాఘవ ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొడారి భాస్కర్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఏటి అండ్ టి  సంస్థ ప్రతినిథి రాఘవ మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం పట్ల అవగాహన కల్పించేందుకు కంప్యూటర్ ల్యాబ్ ఎంతో దోహదపడుతుందన్నారు.

అలాగే స్వచ్ఛమైన తాగునీరు పేద విద్యార్థులకు అందించాలనే ఉద్దేశంతో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం విద్యార్థులకు ఆయన క్రీడా సామాగ్రి, పాఠశాల బ్యాగులను పంపిణీ చేశారు.అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొడాలి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల అభ్యున్నతి కోసం ముందుకు వచ్చిన ఏటి అండ్ టి సంస్థకు, యూత్ ఫర్ సేవా ప్రతినిధు లకు కృతజ్ఞతలు తెలిపారు.