29 March, 2026 | 12:11 AM

వైద్య శిబిరానికి స్పందన

28-03-2026 10:26 PM

ముకరంపుర,(విజయక్రాంతి): నగరంలోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ, పాణి కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరంలో భాగంగా కొక్కెరకుంట, వన్నారం గ్రామాలలో శనివారం నిర్వహించిన వైద్య శిబిరానికి స్పందన లభించింది. ఈ శిబిరంలో గైనకాలజిస్ట్ డాక్టర్ శృతి, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ప్రీతీ, పీడియాట్రిషన్ డాక్టర్ శ్రావణ్, డెంటిస్ట్ డాక్టర్ సాగర్ తమ బృందంతో కలిసి గ్రామస్తులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు పంపిణీ చేశారు.

ప్రత్యేక వైద్య శిబిరములో సుమారు 235 మంది గ్రామస్తులు వైద్య సేవలు పొందారు. ఈ కార్యక్రమంలో శాతవాహన విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ డి. విజయ్ కుమార్, డాక్టర్ టి. తిరుపతి, బి. ఎలిజబెత్ రాణి, డా. కె. అర్జున్, కొక్కెరకుంట సర్పంచ్ జాడి శారద,  వన్నారం సర్పంచ్ ఓం ప్రకాష్, ఉపసర్పంచ్ కుమార్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఈ. మనోహర్, కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. రామకృష్ణ శిబిరంలో సేవలందించిన అందరినీ అభినందించారు.