అందరికీ విద్య, వైద్యం, ఉద్యోగం కోసం సిపిఐ పోరాటం...
10-04-2026 06:46 PM
- జిల్లా కార్యవర్గ సభ్యులు గురుజ రామచంద్ర
మునుగోడు,(విజయక్రాంతి): అందరికీ విద్య, వైద్యం, నివాస సౌకర్యాలు ప్రభుత్వం అందిస్తేనే సమానత్వం వస్తుందని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గురజా రామచంద్రం అన్నారు. మునుగోడు మండలం చొల్లేడు గ్రామంలో ఇంటింటికి సిపిఐ కార్యక్రమం నాలుగో రోజు ఉత్సాహంగా కొనసాగిస్తూ ఇంటింటికి వెళ్లి పార్టీ కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రజలకు సిపిఐ సేవలు, పార్టీ అవసరాన్ని వివరించి మాట్లాడారు. సహజ వనరులను ప్రజలందరికీ సమానంగా పంపిణీ చేయడం ద్వారా మాత్రమే సమసమాజం సాధ్యమవుతుందని అన్నారు. మతం, కులం, ప్రాంతం పేరుతో స్వార్థ రాజకీయాలు చేసే పార్టీలను ప్రజలు గుర్తించాలని, సమసమాజం కోసం పోరాడే సిపిఐ పార్టీని ఆదరించాలని పిలుపునిచ్చారు.




